Sunday, June 20, 2021

Latest Posts

జబర్దస్త్ యాంకర్ పొట్టి బట్టలు నెటిజన్స్ ఫుల్ ట్రాల్

Anchor Anasuya Trolled

జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ తన అందంతో అభినయంతో అందరినీ కట్టిపడేస్తుంది.  యాంకరింగ్‌లో ఈవిడ చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఎదుటివాళ్లకు పంచులు విసురుతూ, విమర్శించేవాళ్లకు కౌంటర్లు వేస్తూ దూకుడుగా వ్యవహరిస్తు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది  అనసూయ.

అయితే ఆమె తాజాగా చిన్నపిల్లలా మారిపోయింది. కొన్నేళ్లు వెనక్కు వెళ్లిపోయినట్లు రెండు జడలు వేసుకుని పొట్టి బట్టల్లో దర్శనమిచ్చింది. నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడూ అలానే ఉన్నాను అంటూ ఈ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి మురిసిపోతుంది.

అయితే చాలామంది ఈ ఫొటోలు చూసి ఆమెను ట్రాల్ చేయడం మొదలు పెట్టేశారు. స్కూల్‌ బ్యాగ్‌ వేసుకోవడం మర్చిపోయినట్లుంది అంటూ సెటైర్లు వేశారు. ఒక వ్యక్తి అయితే.. కరోనా కేసులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. దీని గురించి నీకు కాస్తైనా బాధేయడం లేదా? ఇలాంటి సమయంలో ఈ ఫొటోలు ఎలా పెట్టాలనిపిస్తుంది? అసలు ఇప్పుడీ ఫొటోలు పోస్ట్‌ చేయడం అంత అవసరమా? అని ప్రశ్నించాడు. అయితే ఎప్పుడూ ఘాటుగానే సమాధానమిచ్చే అనసూయ ఈ సారి కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా జనాలకు కొంత వినోదం, మరికొంత నమ్మకాన్ని కలిగించడానికి మేం ప్రయత్నిస్తున్నాం అని బదులిచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

దీంతో పలువురు ఆమ ఆన్సర్‌ను సమర్థిస్తుండగా కొంతమంది మాత్రం విబేధిస్తున్నారు. ఇక ఆమె సమాధానంతో సంతృప్తి చెందని సదరు నెటిజన్‌.. ఈ సమయంలో జనాలకు కావాల్సింది చేయూత తప్ప వినోదం కానే కాదు. ఓ పక్క వాళ్లు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ చచ్చిపోతుంటే వారిని ఇలా ఎంటర్‌టైన్‌ చేయడం కరెక్ట్‌ అని ఎలా సమర్థించుకుంటున్నావు? ఇది కరెక్ట్‌ కాదు అని చెప్పుకొచ్చాడు. అయితే దీని పై ఇంకా స్పందించలేదు జబర్దస్త్ యాంకర్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss