Sunday, June 20, 2021

Latest Posts

యాంకర్ ప్రదీప్ ని కూడా వీడలేదు అందుకే రవి రంగంలోకి

కరోనా సెకండ్‌ వేవ్‌కి భారత దేశం గడ గడలాడిపోతుంది. ప్రతి రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీనితో ప్రభుత్వాలు కర్ప్యూ, లాక్‌డౌన్‌ ప్రకటించినా..కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా సెకండ్‌ వేవ్ పంజా విసురుతోంది. అలానే సినీ పరిశ్రమను కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ వదిలిపెట్టలేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందారు. కొంతమంది స్టార్లు ఇప్పటికీ హోమ్ ఐసోలేషన్‌ల్లో ఉన్నారు.

తాజాగా ప్రముఖ బుల్లి తెర యాంకర్ ప్రదీప్‌ మాచిరాజుకు కరోనా సోకింది. కాస్త కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. అయితే లక్షణాలు తక్కువగానే ఉండటంతో ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోకి యాంకర్‌ రవి వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీని పై యాంకర్ ప్రదీప్ ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss