Anchor Sreemukhi Boyfriend
లాక్ డౌన్ మొదలయ్యినప్పటి నుండి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా ఓ టీవీ సెలబ్రిటీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు పాపులర్ యాంకర్ శ్రీముఖి. ఎందుకంటే ఈ యాంకరమ్మ ఇటీవలే ఓ టీవీ షోలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. బుల్లితెర యాంకర్ గా ఓ రేంజ్ లో రాణిస్తున్న ఈ అమ్మడు త్వరలో పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. పెళ్లి భోజనం పెట్టనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఇది నిజమే అనిపిస్తుంది. ఇటీవలే స్టార్ మా ఛానల్లో ‘స్టార్ట్ మ్యూజిక్’ అనే కొత్త ఎంటర్టైన్మెంట్ షో వారానికి ఒకసారి ప్రసారం అవుతోంది. యాంకర్ సుమ వ్యాఖ్యతగా కొనసాగుతున్న ఈ షో నుండి ఈ వారం రాబోయే ప్రోగ్రాం ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఆ షోలో శ్రీముఖితో పాటు విష్ణుప్రియ, హరి, పండు మాస్టర్ ఆర్జే చైతూ, రోల్ రైడాలు వచ్చారు.
అయితే ఈ షోలో సుమ – శ్రీముఖిల మధ్య జరిగిన సంభాషణలో శ్రీముఖి బాయ్ ఫ్రెండ్ విషయం బయటకు వచ్చేసింది. యాంకర్ సుమ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇక్కడ స్టేజిమీద కనిపిస్తున్నవారిలో ఎవరంటే ఇష్టమని అడిగింది. అందుకు సమాధానంగా తనకు చిరంజీవి అంటేనే ఇష్టమంటూ చటుక్కున చెప్పేసింది శ్రీముఖి. అలాగే ఒకవేళ రొమాంటిక్ డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తావని సుమ మరో ప్రశ్న అడిగింది. అంతే ”ఆల్రెడీ నేను కమిటెడ్.. ఇప్పుడు నేనిలా డేటింగ్ వెళ్తే నా బాయ్ ఫ్రెండ్ ఫీలవుతాడు. నాకంటూ కొన్ని నియమాలున్నాయి” అంటూ సుమక్కకు కౌంటర్ ఇచ్చింది శ్రీముఖి.
ఇవి కూడా చదవండి: