Sunday, June 20, 2021

Latest Posts

పెళ్లి పై సూటిగా సమాధానమిచ్చిన యాంకర్ శ్రీముఖి

Anchor Srimukhi Marriage
తెలుగులోని టాప్‌ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఇటు బుల్లితెరను, అటు వెండితెరను బ్యాలెన్స్‌ చేసే ఈ భామ తనకంటూ ఓ క్రేజ్‌ సంపాదించుకుంది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని రచ్చరచ్చ చేసిన ఈ రాములమ్మ చివరికి రన్నరప్‌గా నిలిచి బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా అభిమానులతో చిట్‌చాట్‌ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తన అభిప్రాయమేంటో చెప్పి షాకిచ్చింది.

శ్రీముఖి అభిమానులలో ఒకరు ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడం. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన శ్రీముఖి “ఇప్పట్లో అయితే నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మా అమ్మానాన్నల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు” అని కుండబద్దలు కొట్టేసింది.  దీనితో ఈ మాట ఫ్యాన్స్ కి మింగుడు పడ లేదు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss