ఏ ముహూర్తాన జగన్ మూడు రాజధానుల వ్యవహారం తెరమీదకి తెచ్చారో కానీ, ఏ పార్టీకి ఆపార్టీలో క్లారిటీ లేకుండా పోయింది. ప్రాంతాల వారీగా విడిపోయి ఎవరి రేంజ్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానన్న సీఎం జగన్ నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు సహా ఉత్తరాంద్ర నేతలంతా స్వాగతించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వ్యతిరేకించారు. పార్టీ అభిమానం కంటే తమకు ప్రాంతీయ అభిమానమే మేటి గా చెప్పుకొచ్చారు.
అయితే అదే ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ లో ఎదిగి కేంద్రమంత్రి కూడా అయిన అశోక్ గజపతి రాజు మాత్రం తనకు ప్రాంతీయ అభిమానం కంటే పార్టీ అభిమానమే మేటి అని చాటారు.ఉత్తరాంద్ర ప్రజల మనోభావాల కంటే చంద్రబాబు మాటే మిన్న గా మెచ్చుకుంటూ ‘అమరావతి’కి అశోక్ జై కొట్టారు. సీఎం జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకం వ్యక్తపరుస్తూ, చంద్రబాబు బాటలో నడుస్తామని వి అశోక్ గజపతిరాజు క్లారిటీ ఇచ్చారు.అయితే అంత మంది ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖకు జై కొట్టినా కానీ మారని అశోక్ గజపతి రాజుకు తాజాగా సొంత కుటుంబంలోనే షాక్ తగిలింది.
అశోక్ గజపతిరాజు అన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీ స్వర్గీయ ఆనంద గజపతి రాజు కూతురు సంచిత తాజాగా 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రశంసలు కురిపించారు. సంచిత ప్రస్తుతం ఈమె బీజేపీ యువమోర్చా విభాగం జాతీయ కార్యవర్గ సభ్యురాలు గా ఉన్నారు. 3 రాజధానులను ఓపక్క బిజెపి వ్యతిరేకిస్తున్నా కూడా ప్రాంతీయ అభిమానాన్ని చాటుకుంటూ, సంచిత తన బాబాయ్ అశోక్ గజపతిని బీజేపీని వ్యతిరేకించి మరీ జగన్ తీసుకున్న విశాఖపట్నం రాజధానికి జై కొట్టడం సహజంగానే సంచలనం అయింది. ఇంకా ఇలాంటి ట్విస్ట్ ఎన్నింటాయో చూడాలి.