Sunday, June 13, 2021

Latest Posts

శ్రీకాకుళానికి చేరిన కరోనా మహమ్మారి

Andhra Pradesh crossed the 1000 mark on corona positive cases

AP లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేని శ్రీకాకుళం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో సిక్కోలు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రవేశించింది. ఇక్కడ 3 కేసులు నమోదవడంతో జిల్లా మొత్తం కల కలం రేగింది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 61 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. కాగా మొత్తం కేసుల సంఖ్య 1016 కి చేరుకున్నాయి. అత్యధికంగా కర్నూలులో 275 కేసులు , కృష్ణా జిల్లాలో కేసుల సంఖ్య 127 కు చేరుకున్నాయి. కాగా ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేని శ్రీకాకుళం జిల్లా లో పాజిటివ్ కేసులు నమోదవడంతో, పోలీసులు ఎలా కరోనా వ్యాపించిందో దర్యాప్తు చేస్తున్నారు.

గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదయిన కేసులు అనంతపురం జల్లాలో 5, ఈస్ట్ గోదావరి జిల్లాలో 3, గుంటూరులో 3, కడపలో 4, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25, కర్నూలులో 14, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 3గా కలిపి మొత్తంగా 61 కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. కాగా వెస్ట్ గోదావరి, విజయనగరం, వైజాగ్ ప్రాంతాల్లో ఒక్క కేసు కూడా గడచిన 24 గంటల్లో నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కర్నూల్ లో 275 పాజిటివ్ కేసులు, గుంటూరులో 209 పాజిటివ్ కేసులు, కృష్ణా జిల్లాలో 127 పాజిటివ్ కేసులతో కలవరపెడుతున్నాయి. కాగా పెరిగిన కేసులతో ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 1000 దాటటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అధికారులు రాపిడ్ టెస్ట్ కిట్ సామధ్యాన్ని పెంచుకున్నామని, గడచిన 24 గంటల్లో 6 వేల సాంపిల్స్ ను పరీక్ష చేశామని, వారిలో 61 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కాగా మరణాల సంఖ్యను 31 గా నిర్దారించడం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss