AP EAMCET ICET and ECET exam dates announced
కరోనా ను అదుపు చేసే క్రమములో లాక్ డౌన్ విదించారు. దీని కారణంగా అన్నీ వ్యవస్థలు మూతపడ్డాయి. వాటిలో ముఖ్యమైనది విద్యా వ్యవస్థ. సరిగ్గా పరీక్షల సమయంలోనే మాయదారి కరోన వచ్చి పడింది. దీని ప్రభావంతో దేశం మొత్తం లాక్ డౌన్ లోనికి వెళ్లింది. అందువల్ల మార్చ్, ఏప్రిల్ లో జరగవలసిన పరీక్షలు కొన్ని పరీక్షలను ఎప్పటికే రద్దు కాగా మరికున్నీ లాక్ డౌన్ ముగిసిన తర్వాత పెట్టడానికి ఆయా ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఇదే క్రమములో ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షలు ఏప్రిల్ లో జరగాల్సి ఉండగా వాటిని జూలై చివరి నాటికి ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఆ తేదీలను ఉన్నతవిద్యా మండలి ఈ రోజు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ జులై 27 నుంచి 31 వరకు, ఈసెట్ 24న జులై మరియు ఐసెట్ 25న జరుగుతాయని తెలిపింది.