Andhra Pradesh govt announced Two new COVID-19 cases
రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం నుంచి శుక్రవారం మరో రెండు పాజిటివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కొత్త రోగులు ఇద్దరకి కరోన నిర్ధారణ పరీక్షలు చేసి వారికి కరోన ఉన్నట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
ఇద్దరి లో ఒకరు విశాఖపట్నంకు చెందిన 25ఏళ్ల మగ వ్యక్తి మార్చి 19 నుండి లక్షణాలు ఉండటంతో అతను మార్చి 21 న నగరంలోని ఛాతీ ఆసుపత్రిలో చేరాడు. గుంటూరు లో ఒక మహిళకు సన్నిహిత పరిచయాల నుండి ఆమెకు వైరస్ వ్యాపించి నట్లు తెలియజేశారు. ఇవే కాకుండా కర్నూలు జిల్లాలోని నోస్సాం గ్రామంలో రైల్వేలో ముఠా లో పని చేస్తున్న 23 ఏళ్ల వ్యక్తి కోవిడ్ -19 కు సంక్రమించినట్లు అనుమానిస్తున్నారు.