లాక్డౌన్ వల్ల రెక్కాడితేగానీ, డొక్కాడనివాళ్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. వారికి అండగా ఉండటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నాయి. దానిలో భాగంగా ఏ పీ ప్రభుత్వం ఈ లాక్ డౌన్ సమయంలో నెలకు రెండు సార్లు రేషన్ ఇస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా రేషన్ పంపిణీ పూర్తి కాగా నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్ధం చసింది ఏపీ సర్కార్.
శనివారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి కేజీ శనగలు, కార్డులోని ప్రతి సభ్యుడికి అయిదు కేజీల చొప్పున బియ్యంను ఉచితంగా అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 13 మూడు జిల్లాల్లోని 28,354 చౌకదుకాణాల ద్వారా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు ఉచిత రేషన్ అందించనున్నారు. వీరితో పాటు రేషన్ కార్డు లేని పేద కుటుంబాలకు కూడా ఉచితంగా రేషన్ అందించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతో 81,862 కుటుంబాలకు మూడో విడత నుంచే ఉచిత రేషన్ అందిస్తున్నారు ఈ సారి కూడా వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏ.పీ 16 మంది పోలీసులపై వేటు