Sunday, June 20, 2021

Latest Posts

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు వాయిదా

Andhra Pradesh SSC Exams Date Postponed

పదవ తరగతి పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది. మొదట ఆంధ్రప్రదేశ్ బోర్డు పరీక్షలను జూన్ 7 న నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా తగ్గకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. జూన్ 7వ తేదీ  సమీపిస్తున్న తరుణంలో, విద్యా శాఖ అధికారులతో సమీక్షా సమావేశానికి సిఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారు. జగన్ అధికారులతో పరీక్షలు నిర్వహించే అవకాశాల గురించి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతిరోజూ దాదాపు 20 వేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దృష్టిలో పరీక్షలు జరిగితే, విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి కష్టపడతారు. ఈ విషయాన్ని అధికారులు జగన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో పరీక్షలను నిలిపివేశారు. ఇకపోతే జూలైలో ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss