Thursday, May 13, 2021

Latest Posts

పేదలకు భూ పంపిణీ కి సిద్ధమవుతోన్న ప్రభుత్వం

Andhra Pradesh took sensational decision :

ఆంధ్ర ప్రదేశ్ సి‌ఎం జగన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేదలందరికీ జులై 8న పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈలోగా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తిచేయాలి అని అధికారులను సూచించారు. ఇళ్లపట్టాలకు సంబంధించి ఇంకా లబ్దిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తులు నాకు వచ్చాయి అని మరో 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెడితే,  ఆ పత్రాలను పరిశీలించి వారికి లబ్ది చేకూరుతుంది అని జగన్ తెలిపారు.

ఇది కూడా చదవండి:ఏ.పీలో మాస్క్, గొడుగు, ఆధార్ కార్డు ఉంటేనే మద్యం

కాగా గ్రామాల్లోకి వెళ్లి నేను అడిగితే.. ఇంటి పట్టా ఎవరికైనా లేదా? అని అడిగితే లేదు అని ఎవ్వరూ అనకూడదు, నాకు ఓటు వేయని వారైనా పర్వాలేదు, వాళ్లకీ పట్టాలు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇంటిపట్టా లేదని చెప్పకూడదు, అని వారందరితో కలిపి 27లక్షల ఇళ్లపట్టాలు మనం ఇవ్వబోతున్నాం అని ఆంధ్ర ప్రదేశ్ సి‌ఎం జగన్ రెడ్డి స్పష్టం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss