Saturday, May 15, 2021

Latest Posts

ఇంతకీ అనిల్ అంబానీ వ్యూహం ఏమిటో

Anil Ambani presents new strategy to save Reliance Communications:

ధీరు భాయ్ అంబానీ కొడుకులు  ముఖేష్,అనిల్ అంబానీలు తమ తమ ఆస్తులు పంచేసుకుని ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అయితే ఇందులో ముఖేష్ వ్యాపారంలో దూసుకెళ్తూ దిగ్గజంగా పారిశ్రామిక రంగంలో ఎదిగాడు. అనిల్ అంబానీ మాత్రం అన్నీ పోగొట్టుకుని దెబ్బతినేసాడు.  ఇక అన్నింట్లో వేలు పెట్టి చివరకు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాడు. ఎస్ బ్యాంక్ సంక్షోభం ఈయన పుణ్యమే అంటున్నారు.   ఇప్పుడు ఎవరిపై కోపం ప్రదర్శించాలో తెలీక  ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్న  అనిల్ అంబానీ తాజాగా కాంగ్రెస్ నేత  రాహూల్ గాంధీపై విమర్శలు చేశాడు.

నిజానికి పారిశ్రామిక వేత్తలు ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం చాలా తక్కువ. అయితే  ఏకంగా రాహులపై అనిల్  పది ప్రశ్నలు వేశాడు. తన కుటుంబం పన్నులు చెల్లిస్తూ దేశ సంపద పెంచుతుంటే తమపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే,సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహూల్ గాంధీ ముఖ్యంగా అంబానీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసాడు.  వాటిని గుర్తు పెట్టుకుని అనిల్ అంబానీ ఇప్పుడు రాహూల్ ను తప్పుబట్టారు. రాహూల్ విమర్శలతోనే తన కంపెనీలు కుప్పకూలాయని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలా రాజకీయ విమర్శలు చేయడం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపికయ్యింది.

రాజకీయలంటేనే గబ్బు అనుకుంటూ, మళ్లీ అందులో ఎందుకు ఇన్వాల్వ్ కావాలని కొందరు పారిశ్రామిక వేత్తల ప్రశ్న.  రాజకీయాలను విమర్శిస్తే ఉన్న పరువు పోతుందని తెలియదా అనిల్ అంబానీ అని కొందరు అంటున్నారు. కష్టాల్లో కూరుకున్న అనిల్ అంబానీ ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తున్నారని పలువురు వాదన.  అయితే కాంగ్రెస్ ను తిడితే కేంద్ర ప్రభుత్వం కరుణించి తన కష్టాలను గట్టెక్కించేలా ఓ మార్గం చూపించిందనే ఉద్దేశంతో ఈ విధంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాలతో పాటు కార్పొరేట్లలోనూ టాక్ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పడాలని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి అనిల్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss