animals also facing Mask troubles over COVID-19
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. వాటి నుంచి మనుషులకే కాకుండా కొన్ని కొన్ని దేశాల్లో ఇప్పటికే జంతువులు కూడా సోకినట్లు మీడియాలో కథనల వల్ల తెలుస్తుంది. ఆ ప్రచారం కొంతమంది జంతు ప్రేమికులకు, పశువుల కాపరులకు భయాందోళనలు కలిగిస్తోంది. అందువల్ల వాటికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పశువుల కాపరి చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. కల్లూరు మండలం పేరువంచ ఎన్టీఆర్ కాలనీ కి చెందిన ఓ వ్యక్తికి కొన్ని మేకలు ఉన్నాయి.
వాటితోనే అతడి జీవనాధారం కావడంతో వాటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ప్రస్తుత కరోనా దృష్ట్యా అతడు వాటికి కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మనుషుల లాగానే వాటికి కూడా మాస్కులు వేశాడు. మేత సమయంలో మాత్రమే వాటిని తీసి వాటికి కావలసిన ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు అందించి మరల మాస్కులు పెడుతున్నాడు. ఇలా చేయడం చుట్టూ ప్రకల వారు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంకా ఇలా కొంత మంది వారి పెంపుడు జంతువులకు మాస్కులు కడుతున్నారు.