Monday, July 26, 2021

Latest Posts

నటనకు గుడ్ బై చెప్పిన హీరోయిన్

Anita Hassanandani Bids Goodbye To Acting

నటి అనితా హసానందాని నటనకు గుడ్ బై చెప్పారు. తాను నటనకు గుడ్ బై చెప్పాలని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నానని, తాను పని చేసే తల్లిగా కాకుండా ఇంటి వద్దే ఉండాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు. ఆమే ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీనితో పని మరియు తల్లిగా మేనేజ్ చేయడం తన వల్ల కాదని అందుకే నటనకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాని ఆమె తెలిపారు.

ఇంతకుముందు, తల్లి అయిన తరువాత విశ్రాంతి తీసుకున్న నటీమణులు చాలా మంది ఉన్నారు. అయితే నేను తల్లి అవ్వగానే పరిశ్రమను విడిచిపెట్టాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాని చెప్పింది అనిత. అయితే ప్రస్తుతం ఉన్న మహమ్మారి దృష్యా ఇంట్లో ఉండడమే క్షేమమని నేను నా పిల్లవాడితో కలిసి ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అని ”అనిత చెప్పింది.

నటి అనిత 2013 లో రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది మరియు ఆమె ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తమ మొదటి బిడ్డ ఆరవ్ రెడ్డికి జన్మనిచ్చింది. నువ్వు నేను, శ్రీరామ్, తోట్టి గ్యాంగ్, నేనున్నాను వంటి తెలుగు చిత్రాలలో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తరువాత ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. తాజాగా ఆమె పాపులర్ హిందీ సీరియల్ నాగిన్ 3 లో నటించింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss