Annapurna Canteens to Feed Migrant workers
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించాయి. కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.లాక్డౌన్ నేపద్యంలో అన్నీ మూత పడడంతో నగరంలోని పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకుండా ఉండాటానికి రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో అన్నపూర్ణ కేంటీన్లు వారి ఆకలిని తీరుస్తున్నాయి. ఏవ్యక్తి పస్తులుండ కూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల మేరకు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ఇచ్చిన ఆదేశాలతో వలసకార్మికులు, పేదల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
అయితే లాక్‌డౌన్‌కు ముందు నగరంలో నిర్వహించిన అన్నపూర్ణ కేంటీన్లను పునరుద్దరించారు. అదే విధంగా అన్ని ప్రాంతాల్లోఅన్నపూర్ణ భోజనం అందుబాటులో ఉండే విధగా రెగ్యులర్ కేంద్రాలతో పాటు, మొబైల్ అన్నపూర్ణ కేంటీన్ల సంఖ్యను కూడా 342కు పెంచినట్టుఅధికారులు తెలిపపారు. రెగ్యులర్, తాత్కాలిక కేంద్రాల ద్వారా సోమవారం ఒక్క రోజే 1,56,350 మందికి ఆహారాన్ని అందించినట్టుఅధికారులు వెల్లడించారు.