Sunday, June 13, 2021

Latest Posts

విశాఖపట్ణంకు ఎంఫామ్ తుఫాను…. అప్రమత్తం అయిన రాష్ట్ర ప్రభుత్వం

Another danger Empam storm in Vishakapatnam

హుదూద్, టిట్లీ వంటి తుఫాన్ ల నుంచి కోలుకున్న విశాఖపట్టణం కు మరో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతుంది.  దాని పేరు ఎంఫామ్ తుఫాను అని, ఇది కూడా హుదూద్ తుఫాను లాంటిదేనాని అభిప్రాయ పడుతున్నారు. ఎంఫామ్ తుఫాను ఏపీ వైపు వచ్చే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.  దానిని ఎదుర్కోవడానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.మే 7 తర్వాత ఏ సమయంలో అయినా ఈ తుఫాన్ రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

తుఫాను తీవ్రతను సరిగ్గా అంచనా వేయాలని, దాని కదలికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సర్వసన్నద్ధం కావాలని, తుఫాను ఉత్తరాంధ్ర వైపు వస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తుఫానును ఎదుర్కొనేందుకు తీసుకోవలసిన జాగ్రతలు ప్రణాళికలు వెంటనే ఆయనకు తెలపాలని అధికారులను  ఆదేశించారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss