Home రాజకీయం మేకపాటికి మరో కీలక శాఖ

మేకపాటికి మరో కీలక శాఖ

Another key branch of Minister mekapati Gautam Reddy

ఇప్పటికే పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను నిర్వహిస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డికి మరో కీలక శాఖను కేటాయిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న శాఖలతో పాటు తాజాగా పెట్టుబడులు, మౌళిక వసతుల శాఖను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

నెల్లూరుకు చెందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఎన్నికల్లో రెండు సార్లు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో వై.ఎస్.ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ తదితర శాఖలను గౌతమ్ రెడ్డికి అప్పగించారు. ఆ శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో తాజాగా పెట్టుబడులు, మౌలిక వసతులశాఖను అప్పగించినట్లు తెలుస్తుంది.

Exit mobile version