మెగా కాంపౌండ్ లో మెగా హీరోలందరూ ఒక్కొక్కరూ ఒక బాక్స్ ఆఫీసు స్టామినాను రూపొందించుకున్నారు. అయితే వీళ్ళు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్న ప్రశ్నకు గంతంలోనే “ఎవడు” కొంత సమాధానమివ్వగా ఇప్పుడు ఇలాంటి మల్టీ స్టారర్ ఇంకొకటి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి తేజ్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా గురించి చెప్పనవసరం లేదు, ఈయన ఒక ఫ్లాప్ సినిమా కూడా కలెక్షన్ల హడావిడి చేయగలదు. అయితే సాయి తేజ్, పవన్ కల్యాణ్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో…. తాజాగా ఒక మలయాళ సినిమా “డ్రైవింగ్ లైసెన్స్”ను తెలుగులో పవన్ కల్యాణ్, సాయి తేజ్ తీయబోతున్నారనే వార్తలు వినిపిస్తునాయి. ఇదే నిజమయితే మరో మెగా మల్టీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం. ఇప్పటికే సూపర్ హిట్ అయిన ఈ సినిమా మలయాళంలో మంచి వసూళ్లను రాబట్టింది.
ఇది కూడా చదవండి: తండ్రి తనయుల పోటీ ?