another new perspective on coronavirus
కరోనా వైరస్ ఎంత మహమ్మారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎటునుండి ఎటువస్తుందో తెలియడం లేదు. ఇప్పుడు ఈ వైరస్ లో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. కొన్ని కొన్ని సందర్బలలో కరోనా నుంచి కోలుకుంటున్న వ్యక్తుల్లో మళ్లీ వైరస్ లక్షణాలు కనిపించడం వైద్యులను కలవరపరుస్తోంది. ఈ సందర్బంలో రోగికి నెగటీవ్ ఫలితం వచ్చినా పూర్తిగా నమ్మలేని పరిస్థితి నెలకొంది. అయితే, చైనాలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన ఉహాన్ నుంచి 65 ఏళ్ల మహిళ ఇటలీకి వెళ్లింది. ఐదు రోజుల తర్వాత ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె హాస్పిటల్లో చేరింది. పొడి దగ్గు, గొంతు నొప్పి, మగత, ముక్కు నుంచి నిరంతరాయంగా చీమిడి కారడం, కళ్లు గులాబీ రంగులోకి మారిపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి. అవి చూసిన వైద్యులు ఆమెకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని నిర్దారించరు.
అప్పటి నుంచి ఆమె తీవ్రమైన జ్వరం, వికారం, కళ్ల నుంచి నీరు కారడం, వాంతులతో నరకయాతన అనుభవించింది. ఆమె హస్పిటల్లో ఉన్న మూడో రోజు వైద్యులు ఆమె కళ్లను శుభ్రం చేస్తూనే ఉన్నారు. ఆమె కరోనాకు చికిత్స పొందిన అన్ని రోజులు ఆమె కళ్ల నుంచి నీరు కారుతూనే ఉంది. వాటిని నర్సులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరీక్షలకు పంపుతూనే ఉండేవారు. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజేస్ నిర్వహించిన పరిశోధనలో కీలక విషయం తెలిసింది. కరోనా వైరస్‌కు గురైన వ్యక్తుల్లో లక్షణాలు బయటపడిన 21 రోజుల తర్వాత కూడా వైరస్ కళ్లలోనే ఉంటోందని తెలుసుకున్నారు. ఇమే లో కూడా ఈ లక్షణమే బయటపడింది.
కరోనాకు చికిత్స అందుకున్న 27వ రోజున ఆమె ముక్కు నుంచి సేకరించిన శాంపిల్‌లో వైరస్ కనిపించలేదు. అయితే, ఆమె కంటి నుంచి సేకరించిన శాంపిల్స్‌లో మాత్రం వైరస్ జీవించే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాకు వైద్యం అందించే డాక్టర్లు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తించాలని పరిశోధకులు తెలుపుతున్నారు.