Monday, April 19, 2021

Latest Posts

పొగాకు వ్యతిరేక దినోత్సవం

కాలానికి అనుగుణంగా ఇప్పుడు ధూమపానం అనేది ఓ ఫ్యాషన్ లాగా మారిపోయింది .. అందులో యువత పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.. పొగాకు అనేది మనం ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికమే . పొగాకు అనేది మన శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌ మరియు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పక్కవాళ్ళకి కూడా ప్రమాదమే… ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.

పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తుంది.ఈ ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తాగే సిగరెట్ బాక్స్ మీద కూడా రాసి ఉంటుంది. అయినా కూడా లెక్క చేయకుండా పొగ తాగుతూ ఏదో స్వర్గాన్ని సాధించినంత ఎంజాయ్ చేస్తూ దానిని తాగుతారు. అంతేనా వాళ్ళు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా పక్కన వాడి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తారు. తాను చేడిన కోతి వనమంతా నాశనం చేసినట్టు.. వాడు తాగి నాశనమయ్యేది కాక పక్క వాడిని కూడా చెడగొడతాడు. గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకంలోని ఒక డైలాగు ఉంటుంది కదా ధూమపానం చేయనివాడు దున్నపోతై పుట్టున్‌ అని అది ఒకప్పుడు మాట. ఇది ఎంత వరకు నిజమో పక్కన పెట్టి నిజంగానే ఇప్పుడు ధూమపానం చేయువాడు దున్నపోతై పుట్టును ఇది నిజం.

సిగరెట్ తాగడం ఏదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టుగా మన సినిమాలలో కూడా దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ కొన్ని పాటలు కూడా రాశారు. ఒక సినిమాలో సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్ తాగు భలె సిగరెట్టు కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు అంటూ భార్య భర్తలు ఇద్దరు సరదాగా ఈ పాటలు పాడుకుంటారు. మరో సినిమాలో ప్రియుడు తన ప్రియురాలికి సిగరెట్ తాగితే స్వర్గాన్ని చూపిస్తుందని అంటూ ఒక పాట పాడతాడు. అదే టాప్ హీరో మూవీలోని బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని తాకండి బాబులు అనే పాట. మరో సినిమాలో సిగరెట్ ని చులకన చేసి చూడొద్దు అని చిరాకు పడొద్దని అదొక మహమ్మారి కాదు అంటూ దాని మహిమ చాలా గొప్పది అంటూ ఆకాశానికి ఎత్తుతూ పాట పాడుతారు మరొక హీరో. ఆ పాటే చిపుగా చూడొద్దు పొరపాటున చిరాకు పడొద్దు సిగరెట్..మహమ్మారి అని తిట్టొద్దు మహిమ తెలుసుకొని జై కొట్టు తెలియకపోతే చెప్తా గాని తప్పని మాత్రం తిట్టొద్దు అంటూ సిగరెట్ మీద ఆ కాలంలో పాటలు బాగానే వచ్చాయి. అప్పుడే కాదు ఇప్పుడు కూడా బానే వస్తున్నాయి.

పొగాకు నిర్మూలన దినోత్సవం అంటూ ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్రయోజనమేముంది. ఎవరు కూడా దానిని తాగడం మానడం లేదు కదా చిన్న పిల్లల సైతం అలవాటు పడిపోతున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి ఎన్ని ర్యాలీలు చేపట్టినా, అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఇలాంటివి ఎన్ని చేసినా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఎందుకంటే విత్తు లేనిది చెట్టు లేదు అంటారు అది నిజమే కదా. పొగాకు సాగు చేయటం, సిగరెట్ తయారు చేయడం అనేది లేకపోతే ధూమపానం ఉండదు కదా. ధూమపానం చేయడం హానికరం అనేదానికంటే పొగాకు పండించి.. సిగరెట్ చుట్టకండి పదిమంది ఆరోగ్యాన్ని పాడు చేయకండి అనేది చాలా గొప్ప నినాదం. ఇదే మా జీవనం ఇదే మా బతుకు తెరువు అని పొగాకు పండించే వాళ్ళు, సిగరెట్ చుట్టేవాళ్లు అంటే అది పొరపాటే. ఇవి కాకుండా ఈ లోకంలో చాలా పంటలు పండించవచ్చు.. చాలా పనులు చేసుకుని జీవించొచ్చు. ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడైనా నలుగురికి మంచి చేసేలా ఉండాలి కానీ నలుగురికి చెడు చేసేలా ఉండకూడదు. ఈ సంవత్సరం నుంచైనా ధూమపానం తగ్గుతుందని.. పొగాకు వ్యతిరేక దినోత్సవానికి ఒక అర్థం ఉంటుంది అంటూ ఆశిద్దాం.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss