Sunday, June 20, 2021

Latest Posts

జాతిరత్నాలు అనుదీప్ జీవితంలో పడ్డ కష్టాలు

Anudeep KV Family Background

అనుదీప్ కేవీ ఒక్క సినిమాతోనే బోలెడు పాపులారిటీ దక్కించుకున్నాడు ఈ యువ దర్శకుడు. ‘పిట్టగోడ’ అనే మూవీతో ఇతను దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. కానీ ఆ సినిమాకి అంత విజయం లభించలేదు. అయినా వెనుకంజ వేయకుండా స్వప్న సినిమా లాంటి పేరున్న సంస్థలో నాగ్ అశ్విన్ నిర్మాతగా ‘జాతిరత్నాలు’ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఇక ఈ సినిమా హిట్ కావడంతో అతని దశే తిరిగి పోయినట్లు కనిపిస్తుంది. చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక విదేశాల్లోనూ ఈ చిత్రం అదరగొడుతోంది. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న అనుదీప్ జీవితంలో కన్నీళ్లకేమీ లోటు లేదట. చదువు మధ్యలో వదిలేసి సినీ రంగం వైపు అడుగులేసిన తనకు కష్టాలే ఆహ్వానం పలికినట్లు అతను వెల్లడించాడు.

తన ఊరు వదిలి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అనుదీప్. ఐతే తాను ఇక్కడ పూట గడవడం కోసం తెలివైన పని చేశానని.. తన లగేజ్ అంతా ఒక ఫ్రెండు గదిలో పెట్టి, తాను వేరే గదిలో ఉండేవాణ్నని.. లగేజే కదా పెట్టింది దానికి రెంటేంటి అని ఒకరితో, నా లగేజ్ ఏమీ లేకుండా ఒకణ్నే ఉంటున్నా కదా దానికి రెంట్ కట్టాలా అని ఇంకొకరితో చెప్పి రెండు చోట్లా అద్దె కట్టకుండా తప్పించుకునేవాడినని అతను తెలిపాడు.

ఇక తాను సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడుతున్న సమయంలో శ్రీకాంత్ అనే స్నేహితుడు ఎంతగానో సాయం చేశాడని, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అతడికి ఉద్యోగం రాగానే తాను కుదురుకునే వరకు ప్రతి నెలా డబ్బులు ఇచ్చాడని.. అతడి మీద అభిమానంతోనే ‘జాతిరత్నాలు’లో హీరోకు శ్రీకాంత్ అనే పేరు పెట్టినట్లు అనుదీప్ వెల్లడించాడు. ఎన్ని కష్టాలున్నా తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడనని చెప్పారు ఈ జాతిరత్నాలు అలియాస్ క్యాష్ అనుదీప్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss