Anushka joins Safe Hands Challenge on Coronavirus:
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా వివిధ చర్యలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ బుధవారం సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ విసిరింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సు మేరకు ఆమె ఈ ఛాలెంజ్ ఇచ్చింది.
ముదుజాగ్రత్త చర్యగా అనుష్క శర్మ తన చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోని ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరారు. సబ్బుతో తన చేతులు కడిగిన అనుష్క శర్మ వీడియో దిగి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా అందరూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని అనుష్కశర్మ సలహా ఇచ్చారు.అంతకు ముందు బాలీవుడ్ మరో నటి దీపికా పడుకోన్ కూడా తన చేతులు కడిగి ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విసిరింది.
కాగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పుదుచ్చేరి మరొక చర్యను ప్రకటించింది. గురువారం నుంచి అన్ని లిక్కర్ బార్లను మూసివేయాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి తెలిపారు. యాత్రా స్థలాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళను బుధవారం నుంచి మూసివేశారు. కరైకల్‌లోని తిరునల్లార్ శనీశ్వరన్ దేవాలయంలో పవిత్ర స్నానాలను ఆచరించడంపై ఇప్పటికే ప్రభుత్వం నిషేధం విధించింది.