Anushka Sharma is celebrating her birthday today
అనుష్క శర్మ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటోంది. 32 ఏళ్ళు నిండిన అనుష్క తండ్రి ఆర్మీ లో పనిచేశారు. కల్నల్ అజయ్ కుమార్ శర్మకు జన్మించి బెంగళూరులోని ఆర్మీ స్కూల్ నుండి విద్యను పూర్తి చేసింది. రబ్ నే బనా దీ జోడి (2008) చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన అనుష్క బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఒక దశాబ్దానికి పైగా కెరీర్లో, అనుష్క అగ్ర నటులు మరియు దర్శకులతో కలిసి పనిచేశారు మరియు కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించారు.
అనుష్క 2014 లో క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ అనే తన నిర్మాణ సంస్థను ప్రారంభించింది.అనుష్క శర్మ తన మూడు చిత్రాలు NH10 (2015), ఫిల్లౌరి (2017) మరియు పరి (2018)లను తానే నిర్మించింది. ఆమె 2017 లో ఒక క్లోత్స్ బ్రాండ్ అయిన “నుష్” ను ప్రారంబించింది. అనుష్క భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకుంది . ఈ జంట 2017 డిసెంబర్లో ఇటలీలోని టుస్కానీలో కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.