Anushka Shetty opens up on her relationship with Prabhas:
యోగా భామ స్వీటీ అనుష్క ,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల నడుమ ప్రేమ వ్యవహారం గురించి ఎన్నో వార్తలు షికారు చేసాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య స్నేహమే తప్ప మరొకటి లేదని ఇద్దరూ తేల్చి చెప్పేసారు. అయినా సరే,ఇటు ప్రభాస్ పెళ్లి చేసుకోలేదు,అటు అనుష్క కూడా ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు. అనుష్క ఫలానా వ్యక్తిని చేసుకొంటోందంటూ ఈమధ్య పలు వార్తలు కూడా వచ్చాయి. వీటిని కూడా ఖండించింది.
భాగమతి` తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క తాజాగా `నిశ్శబ్దం` మూవీ చేసింది. హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ రెండున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు అనుష్క ప్రస్తుతం హాజరవుతోంది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు తాజాగా అనుష్క వెళ్లింది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఫోటోను సుమ చూపించింది.
ఆ ఫొటోను చూసిన వెంటనే అనుష్క షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫోటో చూసిన వెంటనే ‘అతను నా కొడుకు’ అని సమాధానం చెప్పింది. దీంతో సుమ షాకైంది. సరే, కొడుకు కాదు. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పమని సుమ రెట్టించింది. అందుకే కదా ‘ఈయన నాకు కొడుకు అయ్యాడు’అని అనుష్క మరో పంచ్ విసిరింది. ప్రభాస్‌తో రిలేషన్ గురించి అనుష్క చెప్పిన జవాబు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.