Tuesday, April 13, 2021

Latest Posts

బిజెపి నేత విష్ణు హోమ్ క్వారంటైన్ ఎందుకో తెలుసా 

AP BJP leader Vishnu Vardhan Reddy in home quarantine

రెడ్ జోన్ ఏరియాలో ఉన్నవాళ్లు ఎవరూ బయటకు వెళ్లకూడదని,అక్కడకు బయట వాళ్ళు రాకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే చాలామంది రాజకీయ నేతలు సైతం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగిస్తున్నారు. రెడ్ జోన్ లో పర్యటనలు చేసేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో అందునా కర్నూల్ లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అధికారులు తగు జాగ్రత్తలు చెబుతున్నా చాలామంది అతిక్రమిస్తున్నారు.

ఈనేపధ్యంలో  లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు రెడ్‌జోన్‌లో ఉన్న కర్నూలుకు వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.విష్ణువర్ధన్‌రెడ్డిని అధికారులు   హోం క్వారంటైన్‌ చేశారు. ఈ మేరక అధికారులు ఆయన ఇంటికి నోటీసు అతికించారు. నాలుగు వారాల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

నిజానికి అధికారులు నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో ఉన్నారట. అయితే  తాను లేనని చెప్పడంతో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని అధికారులు చెప్పుకొచ్చారు. తాము అంటించిన  నోటీసు ధిక్కరించి ఎక్కడికైనా వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయనపై కేసు నమోదు చేస్తామని మరోపక్క పోలీసులు హెచ్చరించారు. రెడ్‌జోన్‌ కర్నూలు నుంచి వచ్చినందున ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss