Thursday, December 2, 2021

Latest Posts

ఏపీ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting Key Decisions

ఏపీ గవర్నమెంట్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్‌ సంస్కరణలకు ఆమోద ముద్ర లభించింది. వాటితో పాటు ఈ నెలలో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు పథకాలపై కేబినెట్ సమావేశంలో చేర్చించారు. కాగా  3669 కోట్లను ఎప్పటి వరకు నాడు- నేడు కోసం ఖర్చు చేసినట్టు అధికారులు సీఎం జగన్ కు ఈ సందర్భంగా తెలియజేసారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా విద్యా కానుకకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అలాగే క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని.. కర్నూలులో ఏర్పాటు చేసేందుకు, లోకాయుక్తను కర్నూలుకు తరలించే ప్రతిపాదనకు, బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలకు,  పది వేల నుండి 20 వేలలోపు డిపాజిట్ అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులకు ఈ కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లబించినవి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss