Tuesday, March 9, 2021

Latest Posts

ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలు

ఈ రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను సమావేశ అనంతరం మంత్రి కన్నబాబు మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాట్లు, ఒక వేళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకురాకపోతే టెండర్లు పిలుస్తామని, అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదం

తిలిపినట్లు చేప్పారు. కానీ ఇసుకను  కొనదలచిన వారు ఇక నుంచి ఆన్‌లైన్‌ ద్వారా, సొంత వాహనాల్లో కూడా తరలించుకోవచ్చు.

అలాగే ఈ నెల 24న జగనన్న చేదోడు పథకం, జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్‌ బియ్యం సరఫరా చేస్తాం అని తెలిపారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహనాలకు జీపీఎస్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  అలాగే చిరు వ్యాపారులకు ఇచ్చే జగనన్న చేదోడు పథకానికి, రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్ట్‌కు, 6 మెడికల్‌ కాలేజీలకు,  విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు కేటాయింపు, పాడేరు మెడికల్‌ కాలేజీకి 35 ఎకరాలు కేటాయింపు, మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు, ఎస్ఈబీ పరిధిని విస్తరించాలని, ఎస్‌ఈబీ పరిధిలోకి ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ సహా వివిధ జూదాలు డ్రగ్స్, గంజాయిని నిరోధించే బాధ్యతలు ఎస్‌ఈబీకి అప్పగింత, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు ఇసుక రీచ్‌లను అప్పగించాలని ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss