Wednesday, December 1, 2021

Latest Posts

వార్డులో వైద్యుడు

AP cabinet take strong decision over coronavirus cases

మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మరియు డీజీపీ గౌతమ్ సవాంగ్ లతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం కలెక్టర్లు, ఎస్పీలు, పురపాలక సంఘ కమిషనర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఇంట్లో సర్వే చేపట్టాలని, బృందాలుగా ఏర్పడి పటిష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారున్న, లేకున్నా ప్రతి ఒక్కరిని పరీక్షించాలని, కరోన లక్షణాలు కనిపిస్తే గుర్తించాలని సూచించారు.

నగరపాలక సంస్థల్లో ఒక్కో డివిజన్కు, పురపాలక సంఘాల్లో మూడు వార్డులకు వైద్యుడిని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కువ జనసాంద్రత విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్న ప్రాంతాలలో కరోన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అక్కడ క్షుణంగా పరీక్షించాలని తెలిపారు. కరోనను అదుపుతెచ్చి విషయంలో కలెక్టర్లు, పురపాలక సంఘ కమిషనర్లు ముఖ్యపాత్ర పోషించాలని కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss