Monday, May 10, 2021

Latest Posts

రోజాకు ఊహించని ఎదురుదెబ్బ

సినీ నటి,  వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్, ఫైర్ బ్రాండ్  రోజాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నేలపాడు ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా  రాజధాని గ్రామాల్లో అడుగడుగునా చేదు అనుభవం ఎదురైంది.  పెదపరిమి వద్ద రోజా వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు.

రాజధానిపై రోజా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు భారీగా చేరుకున్నారు.  నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. విషయం తెలిసిన మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు.
అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళలు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss