విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీరుస్తూ బెజవాడకు తలమానికంగా నిలిచే బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వాటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.15,591.9 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా వాహనాల రాకపోకలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌లతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ అత్యంత సాంకేతిక విలువలతో రూ.501 కోట్లతో నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ నగరానికి మకుటంలా నిలుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: