Home రాజకీయం విద్యుత్ బిల్లులపై వై.ఎస్ జగన్ కీలక నిర్ణయం

విద్యుత్ బిల్లులపై వై.ఎస్ జగన్ కీలక నిర్ణయం

AP cm jagan took decison on current bills

జగన్ ప్రభుత్వం ఇప్పుడు కరోనా నియంత్రణ సమస్య కన్నా ఎక్కువగా ఎదుర్కొంటున్న అసమ్మతి జ్వాలలు “కరెంట్ బిల్”. ఇంతక ముందు ఎప్పుడు రాని కరెంట్ బిల్ ఇప్పుడు ఆకాశాన్నంటుకుంటుంటే, ప్రజల నుంచి ప్రభుత్వానికి తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయి. గత 50 రోజుల పైగా ఇంట్లోనే ఉంటున్న కార్మికులు ఈ బిల్లులు ఎలా కట్టగలదని ప్రశ్నిస్తున్నారు.అందుకే విద్యుత్ బిల్లులపై వై.ఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

జూన్ 30వరకు విద్యుత్ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు జగన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు అత్యధికంగా వచ్చాయి. దీనిపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. లాక్ డౌన్ సమయంలో వేలకు వేలు విద్యుత్తు బిల్లులు రావడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుతు బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: అసలు తగ్గొదు….. కావాలంటే పోరాటానికైనా రెడీ….

Exit mobile version