Thursday, December 2, 2021

Latest Posts

జగనన్న పచ్చ తోరణం కార్యక్రమాన్ని ప్రారంబించనున్న సీఎం జగన్‌

AP CM Jagan Inaugurat Jagannanna Pacha Thoranam

ఏపీలో “జగనన్న పచ్చ తోరణం” పేరుతో వన మహోత్సవానికి ఏపీ ప్రభుత్వం ఈ రోజు శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. ఈ సారి కూడా ఆ కార్యక్రమానిన్ని చేపట్టనుండది. నేటి నుంచి “జగనన్న పచ్చ తోరణం” పేరుతో వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

కాగా అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు  వారి వారి నియోజక వర్గాలలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్‌ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లోనూ, నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss