ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన సోమవారం ఐదో సారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మోదీకి వివరించారు. లాక్డౌన్లో కేంద్రం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చిందని, దీని వల్ల కరోనా వ్యాప్తి కొంతమేరకు ఆరికట్ట గలిగామని అలాగే లాక్ డౌన్ ముగిసిన తర్వాత, కరోనాకు వ్యాక్సిన్ కనుక్కొనే వరకు వైరస్‌తో మనం సహజీవనం చేయాల్సి ఉంటుందని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాద్యత మనపై ఉందని ఈ సందర్బంగా సీఎం జగన్ మోదీ తో అన్నారు.
భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ లక్షణాలు గుర్తించిన కుటుంబాలు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయని సిఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం వారిని వేరుగా చూస్తుందన్న భావన నెలకొందని, వారిపై వివక్ష కనిపిస్తోందని చెప్పారు. దీని వల్లే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం లేదని అభిప్రాయపడ్డారు. ఇది మొత్తం కరోనా పరీక్షల ఉద్దేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: వీడియోకాన్ఫరెన్స్ లో ఫైర్ అయిన దీదీ