ఆంధ్ర రాష్ట్రం లోని మొత్తం 2452 పాజిటివ్ కేసులుగా ఇప్పటివరకు నమోదయ్యాయి. మొత్తం మీద 1680 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు కరోనా వలన 54 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 718 గా ఉంది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 8,092 సాంపిల్స్ పరీక్ష చేయగా, 45 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో మొత్తం 41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల నెల్లూరు లో ఒక్కరి మరణం నిన్న సంభవించింది. గడచిన నమోదయిన కేసుల్లో చిత్తూరులో 2, నెల్లూరులో 2 కేసులు కోయంబేడుతో సంబందాలు ఉన్నవే కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: