AP croses 1300 cases as corona postive :
ఏపీ ప్రభుత్వం ఈ రోజు 29-04-2020 విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ఒకింత భయాందోళనలకు తావిస్తుంది. ఇంతకింతకు పెరుగుతున్న కేసుల సంఖ్య చూస్తూంటే జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఇంతకింతకు పెరుగుతూనే ఉంది. కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు ఏపీలో 1332 కు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కాగా వీరిలో 287 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ఇప్పటివరకు కరోన వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 31 కు చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1014 అని స్పష్టం చేశారు.
ఈరోజు విడుదలైన కరోన వైరస్ పాజిటివ్ కేసులు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి, పశ్చిమగోదావరి జిల్లాలో – 2, కర్నూలు – 11, కృష్ణా – 13, గుంటూరు – 29, కడప – 04 , అనంతపురం – 04, చిత్తూరు – 03, తూర్పు గోదావరి జిల్లా – 01, పశ్చిమగోదావరి జిల్లా – 02, ప్రకాశం – 04, శ్రీకాకుళం – 01, విశాఖ – 01 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఈ రోజు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో వైరస్ ఫ్రీ జిల్లా గా విజయనగరం జిల్లా లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు అత్యంత జాగ్రతగా ఉండాలని, కొంత కాలం వరకు ఈ మహమ్మారిని మనం ఎదుర్కోవలసి ఉంటుందని సిఎం జగన్ పేర్కొన్నారు.