Home రాజకీయం మందు బాబులకు ఎపి డిజిపి ఝలక్

మందు బాబులకు ఎపి డిజిపి ఝలక్

AP DGP Gautam Sawang

AP DGP Gautam Sawang responded furiously over liquor sales

లాక్ డౌన్ సడలింపులో భాగంగా మద్యం దుకాణాలు తెరుచుకోడానికి అనుమతి ఇవ్వడంతో వేలాది మంది మందుబాబులు రోడ్ల మీదికి వచ్చేసారు. సామాజిక దూరం పాటించకుండా ఒకరిమీద ఒకరు పడిపోయే విధంగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ధరలను 25శాతం పెంచినా సరే,జనం ఎక్కడా ఆగలేదు. దీంతో తొలిరోజు ఎపి మొత్తం మీద 60కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి. ఇక రెండవరోజున మరో 50శాతం పెంచారు. అయినా మందుకోసం జనం రావడం ఏమాత్రం తగ్గలేదు.

ఇది కూడా చదవండి:ఐదుగురు వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

ఈనేపధ్యంలో రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలను ఉల్లంఘించే మద్యం కొనుగోలుదారులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ మద్యం కొనుగోలుదారులు ఖచ్చితంగా నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలో షాపుల వద్ద క్రమ పద్దతిలో మద్యం విక్రయాలు జరపాలని షాపుల యజమానులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. మద్యం కొనుగోలుకు వచ్చే వారు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని సూచించారు.

మద్యం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా గుమికూడరాద ని డిజిపి స్పష్టం చేసారు. నిబంధనలు అతిక్రమించిన షాపులను తక్షణమే మూసివేస్తామని డీజీపీ హెచ్చరించారు. మద్యం సేవించి గొడవకు దిగడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం కల్పించటం చేస్తే జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాదాలు సృస్టించేవారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంటుందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

Exit mobile version