AP DGP Warning on False Propaganda on Corona:
ఒక రోగానికి మందు కనుక్కుంటే,మరో రోగం .. ఇలా అంతులేని రోగాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ అనగానే ప్రపంచంలోని దాదాపుగా సగానిపైగా దేశాలు గజగజ వణికిపోతున్నాయి. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ దాదాపు ఇప్పటివరకు 89 కి పైగా దేశాలలో వ్యాప్తిచెందింది. ఈ కరోనా వైరస్ ప్రభావంతో వరల్డ్ వైడ్ గా ఇప్పటికే దాదాపు మూడు వేల మందికి పైగా మృతిచెందగా సుమారుగా లక్షమందికి పైగా ఈ వైరస్ భారిన పడి దడదడ లాడిపోతున్నారు. ఈ వైరస్ మన భారతదేశానికి కూడా తాకింది. ఇప్పటికే మన దేశంలో 31 పాజిటివ్ కేసులు తేలడంతో వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా చికిత్స చేయిస్తోంది.
అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలని కేంద్రం అప్రమత్తం చేసింది. కరోనా వైరస్ ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తుందని కొందరు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. దీనివలన స్థానిక ప్రజానీకం మన ప్రాంతంలో కూడా కరోనా వచ్చిందంటా అంటూ తీవ్ర భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇలా కరోనా పై సోషల్ మీడియా లో వస్తున్న పుకార్ల పై ఏపీ డీజీపీ సౌరంగ్ స్పందిస్తూ, కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని నమ్మవద్దని అలాగే మీడియా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై అపోహలు సృష్టిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. వదంతులు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పోలీసులకు డీజీపీ ఆదేశాలిచ్చారు. ఏపీలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.