దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు అవుతున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు వందశాతం విధులకు హాజరుకావాల్సిందేనని సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా సచివాలయం సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, విభాగాధిపతులు, జిల్లా కార్యాలయాలు 21 నుంచి వందశాతం సిబ్బందితో విధులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
కాకపోతే దీనినుంచి కంటైన్మెంట్ ప్రాంతాలను మాత్రం మినహాయింపు ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి సామాజిక దూరం,ఖచ్చితంగా మాస్క్ వాడటం లాంటి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే విధులకు హాజరు కావాలని ఉద్యోగులకు సూచించారు. ఈ సంధర్బంగా చర్యలు తీసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, విభాగాధిపతులు, కలెక్టర్లు, ఆఫీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లో మొదలైన హడావిడి
ఇది కూడా చదవండి: ఈ రోజు రాణా నిశ్చితార్ధం?