Home రాజకీయం నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండి

నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండి

99telugu, AP Fake challan scam in registration department, ap latest news, AP under search scan over alleged fake challan scam, E Challan Andhra Pradesh, Fake Challans Scam, Latest Telugu News, Online forgery detected in Andhra Pradesh

AP Fake challan scam in registration department

ఆంధ్ర ప్రదేశ్ లో నకిలీ చలాన్ల ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కడప సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగులోనికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై  రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. దాంతో గుంటూరు జిల్లాలో 35 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శ్రీనివాసరావు ఆదేశాలతో తనిఖీలు చేపట్టాగా మంగళగిరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఈ ఘటనలో 8మంది నకిలీ చలాన్ల మోసాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో తేలడంతో ఆ చల్లన్లు కొనుగోలు చేసి స్టాంప్ డ్యూటీ చెల్లించని వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ మోసాలు 2021 జనవరి నుంచి జరిగినట్లు తెలుస్తుంది.  కాగా ఈ మోసాలకు పాల్పడ్డ వారిపై తగిన చెర్యలు తెసుకోవాలని సబ్ రిజిష్ట్రార్ ఫిర్యాదుతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ చలాన్లతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి వివరాలను కూడా పోలీసులకు అందించారు.

ఇది కూడా చదవండి:  

Exit mobile version