AP fishermen reach their home
AP కి చెందిన మత్స కారులు సొంత జిల్లాకు చేరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మత్సకారులు గుజరాత్ పోర్ట్ లో గత 8 నెలలుగా పొట్టకూటికోసం పని చెయ్యడం జరిగింది. అయితే ఈ కరోనా మహమ్మారి వల్ల వారికి పని లేక కనీసం వారికి అన్నం పెట్టె నాదుడు లేక అక్కడే ఆ పడవలలోనే నీళ్ళు లేక, తిండి లేక, నిద్రపోవడానికి కూడా సరైన వసతి లేక బిక్కు బిక్కు మని గత 45 రోజుల నుంచి అక్కడే ఉండిపోయారు. కాగా వీరిని సొంత రాష్ట్రాలకు పంపమని రెండు తెలుగు రాష్ట్రాలు చేసిన కృషి ఇప్పటికి ఫలించాయి.
ఇది కూడా చదవండి: తమిళనాట కరోనా కల్లోలం – పసికందులకు సైతం
తమను అక్కడ ఆదుకునే నాదుడు లేడని, మహారాష్ట్ర వచ్చాక మాత్రమే మాకు గొంతు తడుపుకునే అవకాశం వచ్చింది అని, ఇక సొంత జిల్లాకు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది అని మత్స కారులు తెలిపారు. ఏపి ప్రభుత్వం వీరిని తరలించడానికి కాను అక్కడి గుజరాత్ ప్రభుత్వం అనుమతి తీసుకుని, వరుసగా రెండు రోజులు పాటు బస్సులతో వేలాది మండి మత్స కారులను AP తీసుకొచ్చింది. కాగా తరలించిన వారికి పరీక్షలు జరిపి, కరోనా లేని వారిని మాత్రమే ఇళ్లకు పంపి, మిగిలిన వారిని ఇక్కడే ఉంచి చికిత్స చేస్తామని, వారికి ఇక్కడే రెండు మండపాలలో వసతిని ఏర్పాటు చేసినట్టు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు.