కేంద్ర ప్రవేశపెట్టిన “స్వీయ ఆధారిత భారత్” ఆర్ధిక ప్యాకేజీలో మొట్ట మొదటి ఆర్ధిక అంశం ఎంఎస్ఎంఈ. కేంద్ర ప్రభుత్వం అందించిన ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు పై ఏపి ప్రభుత్వం తమ వీధి విధానాలును ప్రకటించింది. కాగా ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలను రెండు విధాలుగా విభజించింది ఏపి ప్రభుత్వం.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు స్టిర డిమాండ్ చార్జీలను రద్దు చేస్తూ ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.2 నుంచి రూ. 10 లక్షల రూపాయల వరకు 6% నుంచి 8% వరకు వడ్డీకి మాత్రమే రుణాలను ఇవ్వనుంది. కాగా 20% కొనుగోళ్లను ఎంఎస్ఎంఈ సంభందిత చిన్న చిన్న పరిశ్రమల నుంచే చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలియచేసింది. కాగా 2020 ఫిబ్రవరికి ముందున్న ఎంఎస్ఎంఈ లకు మళ్ళీ ఆరభించే వెసులుభాటును కలిగించింది. అయితే ఈ రీస్టార్ట్ పాలసీ వెసులుబాటును వినియోగించుకోవడానికి మాత్రం జూన్ 30 లోగా దారఖాస్తులు స్వీకరిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: నాబార్డ్ చైర్మెన్ గా చింతల గోవిందరాజులు
ఇది కూడా చదవండి: ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ