Sunday, June 20, 2021

Latest Posts

మరోసారి లాక్ డౌన్ ను పొడిగించిన ఏపీ ప్రభుత్వం

AP Government Extended Lockdown

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొద్ది వారాలుగా అమల్లో ఉన్న కర్ఫ్యూ ఈ రోజుతో ముగియనుంది. దీనితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండటంతో కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జూన్‌ 10 తేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నామని, ప్రస్తుతం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సడలింపు సమయం యథావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss