Home TRENDING కరోనా విషయంలో నిర్లక్ష్యం .. మావోయిస్టుల ఆగ్రహం

కరోనా విషయంలో నిర్లక్ష్యం .. మావోయిస్టుల ఆగ్రహం

CPI Maoist Party Secretary Aruna

AP government is outraged that it has been negligent in the corona cases

కరోనావేళ దాడులకు స్వస్తి చెప్పాలని నిర్ణయించిన మావోయిస్టు పార్టీ తాజా పరిస్థితుల నేపథ్యంలో స్పందించింది.  దేశంలో, రాష్ట్రంలో కరోనా మరణాలకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాలని  డిమాండ్ చేసింది.  ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ విశాఖ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖతో పాటు ఆడియో టేపు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను ఏమాత్రం పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యం కోసం కోట్లలో మాస్కులు, లక్షల్లో టెస్టింగ్ కిట్లు కొన్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కరోనా నివారణ చర్యలు చేపట్టలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఒక్క మాస్క్ గానీ, శానిటైజర్ గానీ ఇవ్వలేదని అరుణ  ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాధిబారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా కరోనాతో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు.

Exit mobile version