వేలం ద్వారా భూముల అమ్మకం ప్రక్రియను మొదలు పెట్టిన ఏపీ సర్కార్. మొదటి విడతలో విశాఖ, గుంటూరు ప్రాంతాలలో మొత్తం తొమ్మిది చోట్ల భూములు అమ్మాలని నిర్ణయించిన ప్రభుత్వం. విశాఖలో ఆరు, గుంటూరులో మూడు ప్రాంతాల్లో భూములను వేలం వేయనున్నట్టు తెలుస్తుంది. కాగా దీనికి బిల్డ్ ఏపీ మిషన్ అని నామకరణం చేశారు. ఈ నెల 29 నా ఈ భూములన్నిటిని వేలం వేయనున్నట్టు తెలియచేసారు.
కాగా ఎలా వేలం వేసిన భూముల సొమ్ముతో నవ రత్నాలు, నాడు – నేడు మరియు మిగిలిన అభివృద్ది కార్యక్రమాలు కొనసాగించాలని ప్రభుత్వం యోచింస్తుంది. ఈ భూముల వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. కాగా గుంటూరు నల్లపాడులో భూమి రిజర్వ్ ధర 6.07 ఎకరానికి ధర 16.96 కోట్లుగా నిర్ణయించింది. వేలం వేసే భూముల విశాఖలో చిన గడ్లీ- 1 ఎకరం రిజర్వ్ ధర: రూ. 16.64 కోట్లుగా, చినగడ్లీ- 75 సెంట్లు రిజర్వ్ ధర: రూ. 14.47 కోట్లుగా, అగనంపూడి- 50 సెంట్లు రిజర్వ్ ధర: రూ. 3.25 కోట్లు గా నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: పంతం నెగ్గించుకున్న AP ప్రభుత్వం