Monday, May 10, 2021

Latest Posts

10వ తరగతి పరీక్షల షేడ్యూల్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

జూలై 10వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న వారి  కోసం ఈ రోజు ఏ.పీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండ  11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది.

భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంన్నట్లు ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయని తెలిపారు. గతంలో లాగా సబ్జెక్టు రెండు పేపర్లు ఉండవని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుందని సూచించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఏలాంటి  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు, పరీక్షల సమయం ఉదయం 9గంటల 30 నిమిషాల నుండి మద్యాహ్నం 12గంటల 45నిమిషాల వరకు జరుగుతాయని తెలిపారు. జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్, 11న సెకండ్ లాంగ్వేజ్, 12న ఇంగ్లీషు, 13న మ్యాథ్స్, జూలై14న, జూలై 15న సోషల్ స్టడీస్‌ జరుగుతాయని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఏ.పీ లో ఘోర ప్రమాదం… పది మంది మృతి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss