AP Government warning To RMP Doctors Over Coronavirus Treatment
కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న పలువురు రోగులు ఇటీవల ఆర్.ఎం.పిల వద్ద వైద్యం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది దాంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పి ఎప్పటికప్పుడు వాలంటీర్లు హెల్త్ వర్కర్ సమాచారం ఇవ్వాలని ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు కూడా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే రోగులకు ఆర్.ఎం.పీలు వైద్యం చేయవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఉత్తర్వులను ఉల్లంగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఎంపీలు వైద్య సాయం అందిస్తే అది వారి ద్వారా ఇతరుల ద్వారా వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త తోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్లు స్పష్టం చేసింది.