AP Govt announces Rs 5 lakh financial assistance to village volunteers
విధులు నిర్వర్తిస్తూ గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి 5లక్షల పరిహారాన్ని జగన్ సర్కార్ అండగా నిలిచింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించింది. ఈ సంఘటన సీఎం జగన్ దృష్టికి రాగా శనివారం అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబానికి వెంటనే అందించాలని అదికారులకు సూచించారు.
దీనికి సంబందించి సీఎంఓ అధికారులతో సీఎం జగన్ ఫోన్లో మాట్లాడి, ఘటన వివరాలపై ఆరా తీశారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో పని చేస్తున్న వాలంటీర్ల కుటుంబాలకు అండగా ఉండాలని అన్నారు. గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ అనురాధ కుటుంబానికి ఆర్ధిక సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్ను ఆదేశించారు. తక్షణ సాయంగా రూ.10వేలు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మృతురాలి కుటుంబానికి అందించారు.