విశాఖలో విషవాయులు లీకేజీ దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శిచి వారికి రూ. కోటి చెక్కులను అందించారు. సోమవారం ఉదయం మంత్రులు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చొప్పున మొత్తం 8 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరం అని ప్రజలంతా ధైర్యంగా ఉండాల్నారు.
గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చిందని, పలు గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టామని నాలుగు గంటల తర్వాత ప్రజలను గ్రామాల్లోకి అనుమతిస్తామని మంత్రి తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రులంతా ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో ఇవాళా బస చేయనున్నట్లు తెలిపారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి నష్ట పరిహారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన 4 రోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు పంపిణీ చేశారు.
ఇది కూడా చదవండి: విశాఖ తరహాలో తెలంగాణలో కూడా గ్యాస్ లీక్