Tuesday, May 18, 2021

Latest Posts

నిరుపేదల ఇంటికే నాణ్యమైన బియ్యం – ఏపీ ప్రభుత్వం

ఏపీ సి.మ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇక నుంచి అంటే  సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏపీలోని నిరుపేదల ఇళ్ళ ముందుకే నాణ్యమైన బియ్యం అందించాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  బియ్యం సరఫరా కోసం ప్రత్యేకంగా డిజన్ చేసిన చక్కటి ప్యాకెట్లగా  మరియు వాటిని వారి ఇళ్ళ ముందుకు చెరచ్చడం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలను కూడా రాష్ట్ర  ప్రభుత్వం వినియోగించబోతోంది. దీని కోసం పది కిలోల ప్రత్యేక బ్యాగులను ప్రభుత్వం రెడీ చేస్తోంది. అయితే ఈ బ్యాగులు, వాహనాల డిజైన్లను శుక్రవారం పౌరసరఫరాల శాఖాధికారులు ఖరారు చేసినట్లు  తెలిపారు. ఏపీలో రేషన్ కార్డుల మీద పంపిణీ చేస్తున్న బియ్యాన్ని ఇక నుంచి  నేరుగా రేషన్ కార్డు లబ్ధిదారుడికి  ఇంటికే సరఫరా చేయబోతున్నారు. ఈ బ్యాగులు, వాహనాల  పై ప్రత్యేకంగా ప్రజలను ఆకట్టుకునేలా ఏ.పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాలతో డిజైన్లు చేయబడ్డాయి .

ఇది కూడా చదవండి: ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss