Thursday, January 28, 2021

Latest Posts

ఎన్నికల కమీషనర్ తొలగింపుపై విమర్శల వెల్లువ

Andhra Pradesh Govt Issues Ordinance to Remove State Election Commissioner

ఏపీ ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని 3ఏళ్లకు కుదిస్తూ  ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ఫైల్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ఆమోదం రాగాకే ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఎన్నికల కమీషనర్  రమేష్‌కుమార్‌ పదవీకాలం ముగియడంతో ఆయన్ని  తొలగిస్తూ మరో జీవో జారీ చేసారు. అయితే ఈ రెండు జీవోలను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. అయితే ఒక్కసారిగా ఇవి వెలుగుచూడ్డంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో గత నెల 21 – 23 – 27 – 29 తేదీల్లో జరగాల్సిన జెడ్పీటీసీ – ఎంపీటీసీ – మున్సిపల్ – గ్రామ పంచాయతీ సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. ఇది రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సామాజిక వర్గం నేత అయిన చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారంటూ సీఎం జగన్ ,,పలువురు మంత్రులు,వైసిపి నేతలు సీరియస్ అయ్యారు. సుప్రీం కోర్టుకి వెళ్లడంతో ఎన్నికల వాయిదాను సమర్థిస్తూనే ఎన్నికల కోడ్ సడలించింది. ఈలోగా జనతా కర్ఫ్యూ ,లాక్ డౌన్ వచ్చేసాయి. పనిలో పనిగా ఇప్పుడు ఎన్నికల కమీషనర్ ని తొలగిస్తూ,ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే  ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ తొలగింపు అంత సులభం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఎలక్షన్‌ కమిషనర్‌ తొలగింపు అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి బాధ్యతలు చేపట్టాక పూర్తి కాలం పదవిలో ఉంటారని, మధ్యలో తొలగించాలంటే విస్పష్టమైన కారణం ఉండాలని, ఇందుకు సంబంధించి 243 (కె) నిబంధన నిర్దేశిస్తోందని చెబుతున్నారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss